హక్కుల కోసం గళం విప్పిన ఆదివాసీలు.. ధర్మయుద్ద సభ సక్సెస్

by Ratna Kumari |

దిశ, ఉట్నూర్ : చట్ట బద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలానే ప్రధాన డిమాండ్ తో అదివారం ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీవో గ్రౌండ్ లో నిర్వహించిన ఆదివాసి ధర్మ యుద్ధ సభలో హక్కుల కోసం

హక్కుల కోసం గళం విప్పిన ఆదివాసీలు.. ధర్మయుద్ద సభ సక్సెస్
X

దిశ, ఉట్నూర్ : చట్ట బద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలానే ప్రధాన డిమాండ్ తో అదివారం ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీవో గ్రౌండ్ లో నిర్వహించిన ఆదివాసి ధర్మ యుద్ధ సభలో హక్కుల కోసం ఆదివాసీ నాయకులు తమ తమ గళాన్ని విప్పారు. సభకు వేలాది మంది రావడంతో సభ విజ‌య‌వంత‌మైంది. ఆదివాసులతో సభ అంత నిండిపోవడంతో జై ఆదివాసీ అనే నినాదాలతో సభ ప్రాంగణం అంత దద్దరిల్లింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోనీ వివిధ జిల్లాల్లో నివాసం ఉండే ఆదివాసి నాయకులు పాల్గొన్నారు. స్థానిక కేబీ కాంప్లెక్స్ లోని కొమురం భీం విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం తుడుం మోగిస్తూ ఇతర వాయిద్యాలతో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ మేధావులు ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీలోని తొమ్మిది తెగల రాష్ట్ర నాయకులు, మేధావులు, పెద్దలు మాట్లాడుతూ.. 1981లో భూమి, భుక్తి, విముక్తి కోసం ఇంద్రవెల్లిలో సభ జరిగితే నేడు ఉట్నూర్ కేంద్రంగా చట్టబద్దత లేని లంబాడలను ఎస్టీ జాబితాలో తొలగించాలని ఆదివాసి ధర్మయుద్ధ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. చట్ట బద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో లంబాడాలను తొలగించడాలని డిమాండ్ చేశారు. రాంజీగోండు, కొమురం భీం, సూరు, ఇతర ఆదివాసి పోరాట యోధులను కాలంలో లంబాడాలు లేరని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో లంబాడాలు ఇతర కులాల్లో కొనసాగుతున్నారని, తెలంగాణలో మాత్రం ఎస్టీలలో కొనసాగుతున్నారన్నారు.


ఆదివాసులకు చెందాల్సిన హక్కులు, రిజర్వేషన్లు హరించుకోవడంతో ఆదివాసులు మరింత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో ఇంకా నేటికి వెనకబడి ఉన్నారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పిడికిలి బిగించాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలన్నారు. ఉట్నూర్ సభ ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివాసుల అస్త్విత్వానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. అంతరిస్తున్న జాతులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రిజర్వేషన్లు, హక్కుల హరించుకోవడంతో రాజ్యాంగ బద్దంగా యుద్ధం కొనసాగుతుందన్నారు. ప్రజా పోరాటాలే కాకుండా రాజకీయ పోరాటాలు సైతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తీర్మాణాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, జీసీసీ చైర్మెన్ తిరుపతి, టీపీసీసీ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ ధర్మ యుద్ధ సభ సమన్వయ కర్త మెస్రం దుర్గు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, నగేష్, రాష్ర్ట, జిల్లా నాయకులు గణేశ్, దాదేరావ్, ఆదివాసి ముఖ్య నాయకులు హెచ్ కే నాగు, రాజు, జంగులతో పాటుగా మహారాష్ర్ట ఆదివాసీ నేతలు తిరుమల్ మహా బావుజీ, సువర్ణ వేర్కడే, తెలంగాణలోని ఆదివాసి తొమ్మిది తెగల సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, మహిళ సంఘం నాయకులు వెంకట్రావ్, ప్రభాకర్, అశోక్, విఠల్ రావ్, విజయ్, సంధ్యారాణి, రామారావు, గంగారాం, జైవంత్ రావ్, పోచయ్య, కనక యాదవ్ రావ్, పుర్క బాపురావ్ పాల్గొన్నారు.

అడుగడుగున ఆంక్షలు..

ఆదివాసులు ఆదివారం ఉట్నూర్ కేంద్రంగా నిర్వహించతలపెట్టిన ఆదివాసి ధర్మయుద్ధ సభతో ఉట్నూర్ పట్టణం అంత అడుగడుగున పోలీసుల ఆంక్షల నడుమ కొనసాగింది. ఉట్నూర్ లోని సభకు వెళ్ళే దారులు, అష్టకుడలి, అంబేద్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఐటీడీఏ ఏరియాలో, తెలంగాణ చౌక్, కేబీ కాంప్లెక్స్, పాత ఉట్నూర్, ఎక్స్ రోడ్డు వద్ద ఇతర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీనితో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తిప్పలు పడ్డారు. ఎక్స్ రోడ్డు కు వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు డీజీపీ మహేష్ భగవత్, అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, కరీంనగర్ సీపీ గౌసం ఆలం సభను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తాం : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పట్టేల్

ఆదివాసీ సమాజంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ పెద్దలను, మేధావులను, నాయకులను సీఎం దృష్టికి తీసుకేల్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. ఒ వైపు జాతి కోసం.. మరో వైపు ప్రభుత్వం కోసం పని చేస్తున్నామన్నారు. ఆదివాసీల సమస్యలపై గల్లీ నుండి డిల్లీ వరకు గత 35ఎళ్ల నుండి పోరాటాలు జరగుతునే ఉన్నాయన్నారు. చట్టాల అమలు ఎవరి పరిదిలో ఉందోనని అందరూ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జాతీకి ఎవరు అన్యాయం చేయవద్దని సూచించారు.

సమాజం కోసం పోరాటాలు చేయాల్సిందే : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి

ఆదివాసీ నవ సమాజం కోసం ప్రజలతో పాటుగా పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. సమస్యలపై అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని, ఇప్పటికి అన్నింటిలో నష్టపోయామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో లంబాడలను ఎస్టీలో చేర్చారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు.

Next Story