MP Godam Nagesh : బీజేపీ ఎంపీ గోడం నగేష్‌కు తప్పిన పెను ప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2025-06-09 15:17:43  IST  )

అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్‌(MP Godem Nagesh)కు భారీ ప్రమాదం తప్పింది(Accident Averted).

MP Godam Nagesh :  బీజేపీ ఎంపీ గోడం నగేష్‌కు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్‌(MP Godem Nagesh)కు భారీ ప్రమాదం తప్పింది(Accident Averted). గోడం నగేష్‌ నేడు అదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం వేళ గాలి వాన బీభత్సం సృష్టించింది. నగేష్ వేదిక మీదికి వెళ్తుండగా భారీ ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా కార్యక్రమ వేదిక టెంటు ఎగిరిపోయి, సభా వేదిక కూలిపోయింది. దీంతో అప్రమత్తం అయిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను తన కాన్వాయ్ లోకి తీసుకు వచ్చారు. కాసేపటికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రీడాకారులంతా పాఠశాలలో తలదాచుకున్నారు. అరగంటపాటు గాలివాన దుమారం రేపింది. కాగా ఎంపీ నగేష్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story