- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్: అక్రమ తవ్వకాలపై అధికారుల సీరియస్ హెచ్చరిక
అక్రమ తవ్వకాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. "ఆయువు తీస్తున్న అక్రమ తవ్వకాలు" అనే శీర్షికతో దిశలో ప్రచురితమైన

దిశ, ఆదిలాబాద్: అక్రమ తవ్వకాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. "ఆయువు తీస్తున్న అక్రమ తవ్వకాలు" అనే శీర్షికతో దిశలో ప్రచురితమైన కథనానికి ఆదిలాబాద్ జిల్లా అధికారులు స్పందించారు. జిల్లాలో భారీగా జరుగుతున్న మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ఇప్పటికే రెండు చిన్నారుల ప్రాణాలను బలితీశాయి. దీంతో ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధికారులు కఠినంగా స్పందించారు.
ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ప్రకటనలో తెలిపారు.. ఇకపై అక్రమ తవ్వకాలపై ఉపేక్ష ఉండదని, తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, లేకపోతే బాధ్యులపై రూ.2 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల మావల ప్రాంతంలో మొరం గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, కారకులైన తవ్వకదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.






