- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేఆర్కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..
ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కేఆర్కే కాలనీలో శనివారం 9 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ఆదిలాబాద్: ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కేఆర్కే కాలనీలో శనివారం 9 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి సందర్భంలోనూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని,గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని స్థానిక ప్రజలకు సూచించారు. బయటి రాష్ట్రాలు,బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన యజమానులపై కూడా కేసులు నమోదు అయితాయని గుర్తుంచుకోవాలన్నారు.250 మంది పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో దాదాపు సరైన ధ్రువపత్రాలు లభించని 107 ద్విచక్ర వాహనాలు,6 ఆటోలు ఒక మినీ ట్రాలీని తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
31 అనుమానస్పద వ్యక్తులను గుర్తించామని తెలిపారు. మాదకద్రవ్యాల కై డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా ఐదు గృహాలను తనిఖీ చేసి, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు. తనిఖీలలో భాగంగా నాలుగు మద్యం బెల్టు షాపులను గుర్తించి, కేసులు నమోదు చేసి వీరి వద్దనుండి దాదాపు 146 మద్యం క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మంది బయట వారిని గుర్తించినట్లు పేర్కొన్నారు.నంబర్ ప్లేట్, ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని 20 వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే ఫణిదర్, బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, డి సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎం చంద్రశేఖర్, డి వెంకటి, ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






