- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఆడెల్లి పోచమ్మ ఆలయానికి కొత్త చైర్మన్.. భోజా గౌడ్ ప్రమాణ స్వీకారం
ఆడెల్లి పోచమ్మ ఆలయానికి కొత్త చైర్మన్.. భోజా గౌడ్ ప్రమాణ స్వీకారం
by Bhanu |
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సారంగాపూర్ మండలం ఆడెల్లి మహా పోచమ్మ ఆలయ చైర్మన్ గా సింగం భోజా గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సారంగాపూర్ మండలం ఆడెల్లి మహా పోచమ్మ ఆలయ చైర్మన్ గా సింగం భోజా గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్ తో పాటు కార్యవర్గం శుక్రవారం కొలువుదీరింది. దేవాదాయ శాఖ ఈవో రమేష్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ గా భోజా గౌడ్, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ... పాలక మండలి సమన్వయంతో పని చేసి ఆలయ ప్రతిష్ట పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






