అదనపు సోయ కొనుగోలు కేంద్రాలు మంజూరు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కుబీర్ : మండలంలో కుబీర్ తోపాటు మరో మూడు సోయ కొనుగోలు కేంద్రాలు మంజూరైన‌ట్టు అధికారుల నుంచి ఆదేశాలు వెలుబడ్డాయి. చాత, పల్సి, మాలేగాం, గ్రామల్లో కొనుగోలు సెంటర్లలో నిర్వహించనున్నారు.

అదనపు సోయ కొనుగోలు కేంద్రాలు మంజూరు..!
X

దిశ, కుబీర్ : మండలంలో కుబీర్ తోపాటు మరో మూడు సోయ కొనుగోలు కేంద్రాలు మంజూరైన‌ట్టు అధికారుల నుంచి ఆదేశాలు వెలుబడ్డాయి. చాత, పల్సి, మాలేగాం, గ్రామల్లో కొనుగోలు సెంటర్లలో నిర్వహించనున్నారు. ఈనెల 1న కుబీర్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో టోకెన్లు పొందడానికివందల సంఖ్యలో రైతులు ఒకేసారి తరలి రావడం తోపులాట జరిగింది. పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. టోకెన్ పొందడానికే ఇన్ని తంటాలు పడాల్సి వచ్చింది. పంట మార్కెట్ లో అమ్ముకోవాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుందోనని ఆందోళ‌నకు లోనయ్యారు. డిసెంబర్ నెల చివరి వరకు కూడా కూపన్ల పై తేదీలను రాసిచ్చారు. అదనపు కేంద్రాలు మంజూరుతో రైతుల ఇబ్బందులు తీరనిన్నాయి.

Next Story