నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు త‌ప్ప‌వు : ఎస్.ఐ. జీవ‌న్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, తాంసి : ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని తాంసి ఎస్ ఐ జీవన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ పేర్కొన్నారు. బుధవారం తాంసి ఎంపీడీఓ

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు త‌ప్ప‌వు : ఎస్.ఐ. జీవ‌న్ రెడ్డి
X

దిశ, తాంసి : ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని తాంసి ఎస్ ఐ జీవన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ పేర్కొన్నారు. బుధవారం తాంసి ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల మండల నాయకులతో అఖిల ప‌క్ష‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఓటర్లను నగదు, మద్యం వంటి వాటికి మభ్య పెట్టెవిధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమ నిబంధనలను వివరించారు. ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించేలా చూడాలని సూచించారు.

Next Story