అక్రమ ఇసుక దందా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

by Ratna Kumari |

అక్రమ ఇసుక రవాణా, నిల్వల దారుపై చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అక్రమ ఇసుక దందా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
X

దిశ, భైంసా : అక్రమ ఇసుక రవాణా, నిల్వల దారుపై చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్పీ జానకి షర్మిల మార్గదర్శకత్వంలో జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు కొనసాగిస్తురని తెలిపారు. బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐచర్ వాహనం, ఒక జేసీబీ ఒక టూ వీలర్ ను పోలీసులు పట్టుకున్నరన్నరు.ధర్మాబాద్ ప్రాంతం నుంచి బాసర-నిజామాబాద్ వైపు ఈ అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిని అరెస్ట్ కాగా.. అందులో 5 గురిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతయాన్నారు. పట్టుబడిన ఇసుక విలువ సుమారు రూ.1,01,400గా ఉంటుందన్నారు. ప్రాథమిక విచారణలో ఇసుక సరఫరా నిర్వహిస్తున్న వ్యక్తి ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ రౌఫ్ గా గుర్తించామన్నారు. ఇతనిపై గతం లో పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు,అటెంప్ట్ మర్డర్ లాంటి ఇతర కేసులు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కి సహకరించిన ప్రతి ఒక్క పోలీస్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో సీఐ కిరణ్ పోలీసులు ఉన్నారు.

Next Story