- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. ఉపాధ్యాయులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దిశ, బేల : బేల మండలం ఖడ్కి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు రాకుండా..ప్రైవేట్ వాలంటీర్ తో బోధన కొనసాగిస్తున్న వైనంపై.. దిశ పత్రికలో "ఆ సారు బడికి రారు..!" శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈ

దిశ, బేల : బేల మండలం ఖడ్కి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులకు రాకుండా..ప్రైవేట్ వాలంటీర్ తో బోధన కొనసాగిస్తున్న వైనంపై.. దిశ పత్రికలో "ఆ సారు బడికి రారు..!" శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించారు. శనివారం ఆ పాఠశాలను ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ,ఏసీఏంఓ జగన్ తో కలిసి వెళ్ళి తనిఖీ చేశారు. పాఠశాలలో రిజిస్టర్లను పరిశీలించి..ఉపాధ్యాయుడి తీరు గురించి విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడి విచారణ జరిపారు. ఈ విచారణలో ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలినట్లు పేర్కొన్నారు. కాగా ఈ విచారణ నివేదికను తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.






