- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలి మెడ నుంచి పుస్తెలతాడు అపహరణ
ఒంటరి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

దిశ, మంచిర్యాల : ఒంటరి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రకాష్ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు వేంపల్లి గ్రామంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న పొద్దురాలిని బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి బలవంతంగా మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు దొంగిలించినట్లు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు పోలీసు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
నమ్మదగిన సమాచారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా రామగుండం వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రాజెక్టు గేటు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అపహరించిన బంగారు పుస్తెలతాడు. ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, వాహన పత్రాలు, 50 గ్రాముల కరాణి కారం పొడి ప్యాకెట్, రెండు గ్లాసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు రామగుండం ఎన్టీపీసీ కి చెందిన విజేతల శ్రీనివాస్, దాసరపు సతీష్ లుగా గుర్తించిచారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు ను 10 గంటల్లోనే చేదించిన సీఐ రవీందర్, ఏఎస్ఐ ఎజాజ్, కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజేందర్, శ్రీనివాస్, నరేందర్ లను సీపీ అభినందించారు.






