- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Distribution of cheques : అబద్దాలాడి రేవంత్ అధికారంలోకి వచ్చారు
రేవంత్ రెడ్డి అధికారం కోసం అబద్దాలు ఆడి సీఎం అయ్యారని, తులం బంగారం ఇచ్చేదెప్పుడు అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు.

దిశ, నేరడిగొండ : రేవంత్ రెడ్డి అధికారం కోసం అబద్దాలు ఆడి సీఎం అయ్యారని, తులం బంగారం ఇచ్చేదెప్పుడు అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు. నేరడిగొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 చొప్పున మొత్తం రూ. 26,03,016 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. అదేవిధంగా బోథ్ మండలానికి చెందిన ఇద్దరికి రూ. 33,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి అధికారం కోసం అబద్దాలు ఆడి సీఎం అయ్యారని ఇప్పుడు తులం బంగారం తావెక్కడ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నానక్ సింగ్, కృష్ణ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేందర్, గులాబ్, పండరీ, పాండురంగ్, ప్రతాప్, తిత్రే మెర్సింగ్, ప్రదీప్ పాల్గొన్నారు.






