- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య
దిశ, బోథ్ : తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేరడిగొండ ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ తెలిపిన

దిశ, బోథ్ : తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేరడిగొండ ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో కాడని వినోద్(23) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ ఓ ఫర్టిలైజర్ షాపులో పని చేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఎందుకు పనికి వెళ్లడం లేదని మందలించారు. దీంతో క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోయి వారికి ఉన్న వ్యవసాయభూమిలోని పత్తి పంటలో పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. పెద్దకుమారుడు వినోద్ కనపించకపోవడంతో తండ్రి, చిన్న కుమారుడు వ్యవసాయ భూమిలోకి వెళ్లిచూడగా.. వినోద్ అచేతన స్థితిలో పడి ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి 108 వాహనంలో బోథ్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మరణించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






