ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

by Ratna Kumari |

దిశ, గాంధారి : మండ‌ల ప‌రిధిలోని పోతంగ‌ల్ క‌లాన్ గ్రామ శివారులో ప్ర‌మాద‌వ‌శ‌త్తు మ‌హిళ ప‌డి మృతి చెందిన‌ట్టు గాంధారి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్.ఐ.

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి
X

దిశ, గాంధారి : మండ‌ల ప‌రిధిలోని పోతంగ‌ల్ క‌లాన్ గ్రామ శివారులో ప్ర‌మాద‌వ‌శ‌త్తు మ‌హిళ ప‌డి మృతి చెందిన‌ట్టు గాంధారి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్.ఐ. ఆంజ‌నేయులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన దుర్కి సాయవ్వ (40) తన భర్త ప్రసాద్ ని రెండో పెళ్లి చేసుకొని నిజాంసాగర్ లో ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య సాయవ్వ పోతంగల్ కలాన్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నట్టు స‌మాచారం. అయితే చెరువు స‌మీపంలో చెప్పులు ఉండ‌టం చూస్తే.. సాయ‌వ్వ కాల‌కృత్యాల కోసం గిద్ద చెరువు వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ ప్ర‌మాద‌వ‌శాత్తు జారి మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. మృతురాలు కూతురు సౌంద‌ర్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్.ఐ. ఆంజ‌నేయులు వెల్ల‌డించారు.

Next Story