- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని..!
విద్య, చైతన్యం, పోరాట అనుభవానికి ప్రతీకగా నిలిచిన రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యోతినగర్ కు చెందిన మోతె స్వప్న రాణి కౌన్సిలర్ బరిలోకి దిగారు.

దిశ, రామకృష్ణాపూర్ : విద్య, చైతన్యం, పోరాట అనుభవానికి ప్రతీకగా నిలిచిన రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యోతినగర్ కు చెందిన మోతె స్వప్న రాణి కౌన్సిలర్ బరిలోకి దిగారు. విద్యావంతురాలిగా మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానికంగా స్వప్న పై మంచి అభిప్రాయం ఉండటం కలిసి వచ్చే అవకాశాలు.. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన స్వప్న సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంది. ఆమె, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మహిళలు, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ హామీలతో స్వప్న తో ప్రత్యర్థులు బేరసారాలు చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం, నిజాయితీతో కూడిన పాలన, పారదర్శక అభివృద్ధే తన లక్ష్యమని స్వప్న రాణి స్పష్టం చేశారు. స్వప్న రాణి కి మద్దతు తెలపాలని ఆమె శ్రేయోభిలాషులు, ఏరియా పెద్ద మనుషుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.






