- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

దిశ, ఉట్నూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. చేవెళ్ల కోర్టులో జరిగిన అత్యంత ఆమానుష ఘటనను నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలు ధరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ గతంలో అనేక న్యాయవాదులపై దాడులు, హత్యలు జరిగిన విషయాలను గుర్తు చేశారు. రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చేవెళ్ల కోర్టు లో జరిగిన మహిళా న్యాయవాది హత్య చేసిన వారందరినీ తక్షణమే గుర్తించి, కఠిన చర్యలు తీసుకొని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాపురెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్ నాయక్, ప్రధాన కార్యదర్శి జైవంత్ రావు, న్యాయవాదులు జమీర్ ఖాన్, ధీరజ్ గుప్తా, పెందూర్ ప్రభాకర్, శ్రీనివాస్, గిరి, వసంత్ రావు, నాతరి రాజు, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.






