- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్ల జొన్నల కొనుగోలులో షెడ్యూల్ పాటించాలి
by Ratna Kumari |
వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెల్ల జొన్నలు తీసుకువచ్చే రైతులు తప్పనిసరిగా మార్కెట్ కమిటీ రూపొందించిన షెడ్యూల్‌ను పాటించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు

X
దిశ, ఆదిలాబాద్ : వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెల్ల జొన్నలు తీసుకువచ్చే రైతులు తప్పనిసరిగా మార్కెట్ కమిటీ రూపొందించిన షెడ్యూల్‌ను పాటించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే రైతులు ధాన్యం తీసుకురావాలని తెలిపారు. షెడ్యూల్ లేకుండా వచ్చిన రైతులకు కూడా ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కొనసాగించామని చెప్పారు. రైతుల కోసం మార్కెట్ యార్డులో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. రైతులు మార్కెట్ కమిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Next Story






