- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల డిపో వద్ద పోలీసు అధికారి అత్యుత్సాహం..!
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సేవలు కల్పించేందుకు మంచిర్యాల ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేశారు.

దిశ, మంచిర్యాల : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సేవలు కల్పించేందుకు మంచిర్యాల ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి ప్రైవేట్ డ్రైవర్ పై తన ప్రతాపం చూపించాడు. దీంతో మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ డ్రైవర్లు బస్ డిపో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా బస్సులను నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. బస్సులు బయటకు తీస్తే రెగ్యులర్ ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటారని, ఆ సమయంలో తమకు రక్షణ కల్పించే బాధ్యత ఎవరిదని ప్రైవేట్ డ్రైవర్లు అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసు అధికారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లు డ్రైవర్లు ఆరోపించారు. విచక్షణారహితంగా దాడి చేసి, ఛాతీపై గుద్ది, అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలకు భద్రత కల్పించమని అడగడం తప్పా, రక్షించాల్సిన పోలీస్ అధికారి బాధ్యత మరచి ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని డ్రైవర్లు నిలదీస్తున్నారు.
సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల డిపోలో ఉదయం నుంచి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విధులకు హాజరు కాలేదు.






