- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి: అఖిలపక్ష నాయకుల వినతి
మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు.

దిశ, బజార్ హత్నూర్: మండల కేంద్రంలో మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలుకు ప్రత్యేక సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు, రైతులు సోమవారం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో పి.ఐ.సి ఇంచార్జ్ సంతోష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, రవాణా ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ సీఈఓ నారాయణగౌడ్, అఖిలపక్ష నాయకులు, రైతులు,కొత్త శంకర్, లక్కం శంకర్, చట్ల సుకుదేవ్, సూది నంది నర్సయ్య , కీర్తి చంద్రశేఖర్, చట్ల రమేష్,పాల్గొన్నారు.బాల గోవింద్, సుభాష్ తదితరులు హాజరయ్యారు. దీంతో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని పి.ఐ.సి ఇంచార్జ్ సంతోష్ హామీ ఇచ్చారు.






