- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీ కొట్టిన లారీ.. యువకుడు మృతి
దిశ, జన్నారం : బైకు పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, జన్నారం : బైకు పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం సింగరాయిపేట గ్రామానికి చెందిన అడాయి మారుతి(25) మేస్త్రీగా పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే మంగళవారం కూడా సింగరాయి పేట నుంచి జన్నారం కు పని నిమిత్తం బయలుదేరాడు. వెనుక గంగాధర్ ను కూర్చొబెట్టుకొని ఏపీ 01ఎస్ 150 అనే నెంబర్ గల బైకు పై బయలుదేరి వెళ్లారు. చింతగూడ గ్రామ సమీపం వద్దకు వెళ్లగానే ఏపీ39యూక్యూ6579 నెంబర్ గల లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారుతి , గంగన్నలు ఎగిరి పడ్డడడంతో మారుతి తలకు తీవ్రగాయాలు కావడంతో మారుతి అక్కడికక్కడే మృతి చెందగా.. గంగాధర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ ఆంధ్రప్రదేశ్ న్యూజీవీడుకు చెందినది. లారీ డ్రైవర్ కెలారి బలరామ కృష్ణ గా గుర్తించారు. మృతుని తండ్రి భీము ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ బలరామకృష్ణ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.






