- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. ఆస్తి నష్టం ఎంతో తెలుసా..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు దగ్ధమైన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

X
దిశ, లోకేశ్వరం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు దగ్ధమైన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గడ్ చందా గ్రామానికి చెందిన బ్యాగరి రవి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి ఇల్లు పాక్షికంగా దగ్ధమైందని తెలిపారు. ఇంట్లోని టీవీ ఫ్రిడ్జ్ తదితర నిత్యావసర సరుకులు కాలిపోయాయని తెలిపారు. సుమారుగా రూ.3,50,000 ఆస్థి నష్టం కలిగి ఉంటుందని వారు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించామని ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






