- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యునికి డాక్టరేట్ పట్టా ప్రదానం
మండల పరిధిలోని పొట్టపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి పెద్దోళ్ల రాములు-గంగవ్వ దంపతుల మూడవ కుమారుడు నరేష్ కుమార్ రాజనీతి శాస్త్ర విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

దిశ, లక్ష్మణచందా : మండల పరిధిలోని పొట్టపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి పెద్దోళ్ల రాములు-గంగవ్వ దంపతుల మూడవ కుమారుడు నరేష్ కుమార్ రాజనీతి శాస్త్ర విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమణ పర్యవేక్షణలో "విద్యా హక్కు చట్టం మహిళ సాధికారత పై దాని ప్రభావం" అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. నరేష్ కుమార్ ప్రస్తుతం నిర్మల్, మంచిర్యాల్ జిల్లాలలో జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యునిగా విధులు నిర్వహిస్తున్నారు. పీహెచ్డీ పరిశోధనలో తనకు సహకరించిన గురువులు, ప్రొఫెసర్లు, స్నేహితులు, బంధువులు కుటుంబ సభ్యులకు డాక్టర్ నరేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణ ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభమైన తన విద్యా ప్రస్థానం నేడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందడం విశేషం. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.






