- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట..
పెళ్లి ముహూర్తానికి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ వధువు అస్వస్థతకు గురై ఆసుపత్రి బెడ్ ఎక్కింది.

దిశ, మంచిర్యాల టౌన్ : పెళ్లి ముహూర్తానికి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ వధువు అస్వస్థతకు గురై ఆసుపత్రి బెడ్ ఎక్కింది. దీంతో వరుడు చేసేదేమీలేక ఆమెకు ఆసుపత్రి బెడ్ పైనే తాళిబొట్టు కట్టి వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన గురువారం మంచిర్యాలలో జరిగింది. పూర్తివివరాల్లోకి వెళ్తే చెన్నూర్ మండలం లంబడి పల్లికి చెందిన శైలజకు భూపాల్ పల్లికి చెందిన తిరుపతితో ఈ నెల 23న పెళ్లి నీచయమైంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తిచేసుకొన్నారు.
ఇంతలోనే ఆ వధువు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు వధువుకి చికిత్స అందిస్తూ ఉండగానే పెళ్లి వాయిదా పడొద్దు అనే ఉద్దేశ్యంతో వరుడు కాస్త బెడ్ పైన ఉన్న వధువు మెడలో తాళిబొట్టు కట్టి భార్యను చేసుకున్నాడు. పంతులను పిలిపించి పెళ్లి తంతు కాస్త ముగించేశారు. పెళ్లి ముహూర్తం దాటి పోవద్దు అనే ఉద్దేష్యంతోనే ఆసుపత్రిలోనే పెళ్లి జరిపించామని ఇరుకుటుంబ సభ్యులు వెల్లడించారు.






