పిడుగుపాటుకు 70 గొర్రెలు మృతి

by Sridhar Babu |   (  Updated:2024-10-17 12:52:37  IST  )

సారంగాపూర్ మండలంలోని రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి.

పిడుగుపాటుకు 70 గొర్రెలు మృతి
X

దిశ,సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి. చౌహాన్ వినేష్ అనే వ్యక్తి గొర్రెలు మెపడానికి ఊరి శివారుకి వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో పిడుగు పడటంతో 70 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

Next Story