ఎన్నికల త‌నిఖీల్లో 6.49 ల‌క్ష‌ల విలువ గ‌ల మ‌ద్యం సీజ్

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లాలో నిర్వ‌హించిన పోలీస్ త‌నిఖీల్లో 6.49 ల‌క్ష‌ల విలువ చేసే మ‌ద్యంతో పాటు ఇత‌ర సామాగ్రి సీజ్

ఎన్నికల త‌నిఖీల్లో 6.49 ల‌క్ష‌ల విలువ గ‌ల మ‌ద్యం సీజ్
X

దిశ, ఆసిఫాబాద్ : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లాలో నిర్వ‌హించిన పోలీస్ త‌నిఖీల్లో 6.49 ల‌క్ష‌ల విలువ చేసే మ‌ద్యంతో పాటు ఇత‌ర సామాగ్రి సీజ్ చేసిన‌ట్టు ఎస్పీ నితిక పంత్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో రూ.22వేల న‌గ‌దు, సుమారు రూ.1.88 వేలు విలువ చేసే 324 లీట‌ర్ల మ‌ద్యం స్వాధీనంతో పాటు రూ.1.94 వేలు విలువ గ‌ల 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 90 చీరెలు, 2.45 ల‌క్ష‌ల విలువ గ‌ల 18 గంజాయి మొక్క‌లు, 2.6 కిలోల ఎండు గంజాయి ప‌ట్టుకోగా.. గ‌త ఎన్నిక‌ల్లో గొడ‌వ‌ల‌కు పాల్ప‌డిన రౌడీషీట‌ర్లు అనుమాన‌స్ప‌దంగా ఉన్న 959 మందిని జిల్లా వ్యాప్తంగా గుర్తించి ముంద‌స్తుగా బైండోవ‌ర్ చేసిన‌ట్టు తెలిపారు. మూడు విడుత‌ల ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు పోలీస్ ఇత‌ర శాఖ‌ల సిబ్బంది రాత్రి, ప‌గ‌లు చ‌లిని లెక్క చేయ‌కుండా విధులునిర్వ‌హించిన ఉద్యోగుల‌తో పాటు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన ప్ర‌జ‌ల‌ను ఎస్పీ ప్ర‌శంసించారు.

Next Story