- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో ఓ వ్యక్తికి 35 ఏళ్ల జైలు శిక్ష
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : పోక్సో కేసులో ఓ వ్యక్తికి 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ నితిక పంత్ తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, ఆసిఫాబాద్ : పోక్సో కేసులో ఓ వ్యక్తికి 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ నితిక పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ లోని ప్రవేట్ కళాశాలలో చదువుతుంటున్న జిల్లాకు చెందిన ఓ అమ్మాయిని నిజామాబాద్ లోని కంటేశ్వర కాలనీకి చెందిన సాయి చరణ్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. సదరు అమ్మాయిని అపహరించి అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించినట్టు బాధితురాలి తండ్రి ఏప్రిల్ 03, 2013లో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. కోర్టులో హాజరు పరచగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 35 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలిస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Next Story






