నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో బాలుడి మిస్సింగ్ క‌ల‌క‌లం.. వారం రోజులైనా దొర‌క‌ని ఆచూకీ

by Ajay Maddhiboyina |

నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన పసుపులేటి అనిల్ చంద్రిక దంపతుల కుమారుడు అశ్విన్ (3) అదృశ్య‌మై నేటికి వారం రోజులు అవుతోంది. శనివారం మధ్యాహ్నం బాలుడు అదృష్యం అవ్వ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు.

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో బాలుడి మిస్సింగ్ క‌ల‌క‌లం.. వారం రోజులైనా దొర‌క‌ని ఆచూకీ
X

దిశ‌, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన పసుపులేటి అనిల్ చంద్రిక దంపతుల కుమారుడు అశ్విన్ (3) అదృశ్య‌మై నేటికి వారం రోజులు అవుతోంది. శనివారం మధ్యాహ్నం బాలుడు అదృష్యం అవ్వ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు.

దీంతో సంక్రాంతి పండుగపూట అంద‌రూ ఆనందంగా గ‌డిపితే ఆ కుటుంబం మాత్రం బాలుడి కోసం రాత్రింబ‌వ‌ళ్లు తిండి నిద్ర మానేసి ఎదురుచూస్తూనే ఉంది. ఇప్ప‌టికే నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంతో పాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాలనూ జ‌ల్లెడ ప‌ట్టినా ఫలితం లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కాలనీవాసులు కోరుతున్నారు. ఇంటి ముందే ఆడుకుంటున్న బాలుడు క‌నిపించ‌కుండా పోవ‌డంతో స్థానికులు పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపించాలంటేనే బ‌య‌ప‌డిపోతున్నారు.

Next Story