బైంసాలో 2005 ఫలితాలు పునరావృతం కానున్నాయి : మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు ప‌టేల్

by Ratna Kumari |

రేపు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బైంసాలో 2005 సంవత్సర ఫలితాలు రిపీట్ అవుతాయని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు.

బైంసాలో 2005 ఫలితాలు పునరావృతం కానున్నాయి : మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు ప‌టేల్
X

దిశ, భైంసా : రేపు వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బైంసాలో 2005 సంవత్సర ఫలితాలు రిపీట్ అవుతాయని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల‌ సమావేశంలో మాట్లాడారు. రేపు వెలుపడే పట్టణ మునిసిపల్ ఫలితాలలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని, గంగా,యమునా నదుల కలయిక లాగా చైర్మన్ పీఠం ఎన్నుకునే పరిస్థితి ఏర్పడతాయని జోష్యం పలికాడు. భైంసా పట్టణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగేందుకు సహకరించిన ప్రతి అధికారికి, ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story