- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీవీ చిత్ర పటానికి గౌరవ వందనం సమర్పించిన అడిషనల్ డీజీపీ
by Ajay Maddhiboyina |
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా 104వ జన్మదిన వేడుకలను శనివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా 104వ జన్మదిన వేడుకలను శనివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు. పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. అదనపు డిజిపి (శాంతి భద్రతలు) మహేష్ ఎం. భగవత్ ఈ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
పి.వి.నరసింహారావు దేశానికి ప్రధానిగా చేసిన సేవలు, ముఖ్యంగా ఆర్థిక రంగంలో చేసిన సంస్కరణలు, విద్యా రంగంలో చేసిన అభివృద్ధి, భాషా, సాంస్కృతిక రంగాల పట్ల ఆయన చూపిన అభిమానాన్ని పోలీస్ అధికారులు గుర్తుచేసుకున్నారు. శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్, సిఎస్ ఓ సిహెచ్ యోగేశ్వరరావు, డీఎస్పీలు ఏ. వేణుగోపాల్, ఉదయ భాస్కర్ , పోలీస్ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






