Addanki Dayakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రెడీ.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

కుల గణన విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు.

Addanki Dayakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రెడీ.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుల గణన (caste census) విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే రిపోర్టు బయటకు పెట్టలేదని ఆరోపించారు. మూడు నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దని కొనియాడారు. అది తట్టుకోలేక బీసీలకు న్యాయం చేయడంలో వెనుకబడ్డామని ప్రతిపక్షాలు ఆతృతతో ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కమిషన్ ప్రకారం బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. పదేళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ ఏ నాడు బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదన్నారు.

మరోవైపు కులగణన సర్వేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేపట్టిందో అదే తీరులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. కానీ తెలంగాణలో ముస్లిం జనాభా పెరుగుతుంది.. ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారింది అని.. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ముస్లిం జనాభా బీసీల్లో పెరుగుతున్నదని, బీసీల్లో వారిది పది శాతానికి వచ్చిందన్నారు. కుల గణన సర్వేను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అబాసు పాలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమస్యలు పరిష్కరించబోతుందని చెప్పారు.

Next Story