బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే.. కేసీఆర్‌పై సీబీఐ కేసే కొట్టేసింది : అద్దంకి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-02-26 15:15:58  IST  )

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు అంటే ఎవరు నమ్మరని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే.. కేసీఆర్‌పై సీబీఐ కేసే కొట్టేసింది : అద్దంకి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు (BRS and BJP) వేరు వేరు అంటే ఎవరు నమ్మరని, ఒకటేనని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addaniki Dayakar) ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మొదటి నుంచి కాపాడుకుంటా వస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌పై పీఎఫ్ సహార కేసుకు సంబంధించి సీబీఐ కేసు పెడితే పూర్తిగా కొట్టివేసిందని ఆరోపించారు. అది ఎవరికి తెలియకుండా చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని వెల్లడించారు. పదేళ్లలో ఒకసారి రాష్ట్రపతి అభ్యర్థి అంశంలో బీజేపీని బీఆర్ఎస్ విభేదించిందని తెలిపారు. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టం, ప్రతి బిల్లుల అమలు సందర్భంలోనూ కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్, బీజేపీ మధ్య రాజకీయ రహస్య ఒప్పందం మొదటి నుంచి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీల యొక్క చీకటి ఒప్పందం చేసుకున్నాయని, (Congress) కాంగ్రెస్ ముక్త్ ప్రొగ్రామ్‌కి బీఆర్ఎస్ గతంలో సహాకరించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ను బీజేపీ పార్టీ కాపాడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు.

click for tweet ..

Next Story