Addanki Dayakar: సీఎం రేవంత్ రెడ్డితో అద్దంకి దంపతులు.. జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ

by Ramesh Naini |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు.

Addanki Dayakar: సీఎం రేవంత్ రెడ్డితో అద్దంకి దంపతులు.. జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) దంపతులు కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. (MLA Quota MLC Elections) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో అద్దంకి దయాకర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్‌కు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను నిన్న ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, కేతావత్​శంకర్​ నాయక్, విజయశాంతిలను అభ్యర్థులుగా ప్రకటించారు. అలాగే మరో సీటును సీపీఐ పార్టీకి కేటాయించిన విషయం విదితమే.

Next Story