Addanki Dayakar: మీనాక్షి నటరాజన్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు.. అద్దంకి దయాకర్ కౌంటర్

by Ramesh N |   ( Updated:2025-03-02 06:04:06.0  )
Addanki Dayakar: మీనాక్షి నటరాజన్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు.. అద్దంకి దయాకర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), సీఎం రేవంత్ రెడ్డి పై నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. కొత్త ఇంచార్జ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడొ తాకినట్లు ఉన్నాయని అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద జోక్ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు. ప్రజలను సొమ్మును బ్యాగులకు బ్యాగులు, కంటైనర్లకు కంటైనర్లు మీరు దోచుకుంటుంటే.. కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పిందని ఆరోపించారు.

అలాంటి నాయకుడిని ఫామ్‌హౌజ్‌లో కూర్చోబెట్టింది (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఊక దంపుడు ఉపన్యాసాలు, వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేశారు.. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి (KCR) కేసీఆర్‌ను పడగొట్టినోడు రేవంత్ రెడ్డి.. అది మీరు జీర్ణించుకోలేక రాజకీయ అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ఏడ్వడం మానుకో కేటీఆర్.. మైక్ ముందు మైక్ వెనుక నిజాలు చెప్పలేని పార్టీ బీఆర్ఎస్.. అంటూ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఆలోచనా విధానానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు.



Next Story