- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki: పందికొక్కుల్లా దోచుకున్న మీరు మా గురించి మాట్లాడుతారా?..అద్దంకి దయాకర్ కౌంటర్
బీఆర్ఎస్ విమర్శలకు అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై బీఆర్ఎస్ (BRS) చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఖండించారు. కాపలా కుక్కలా ఉంటానని చెప్పి తెలంగాణ సంపదను పందికొక్కుల్లా దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను విమర్శించే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ లో బహుళ స్థాయి నాయకత్వం ఉందని బీఆర్ఎస్ మాదిరిగా ఒక వ్యక్తి పార్టీ కాదన్నారు. ఆదివారం ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన.. పార్టీ నాయకులు పార్టీ పని చేస్తే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా బానిసలు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. బీసీల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, మీనాక్షి నటరాజన్ ను తక్కువ చేసి మాట్లాడటం జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కుసంస్కారానికి నిదర్శనం అని దాంతో మా పార్టీకి, ప్రభుత్వానికి వచ్చే తలవంపులేమి లేవన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు మారాలని హితవు పలికారు.






