- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళినే భయపడ్డాడు: HCU వివాదంపై అద్దంకి దయాకర్
400 ఎకరాల ప్రాపగాండాలో ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళి భయపడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 400 ఎకరాల ప్రాపగాండాలో ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళి భయపడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) పార్టీలపై సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. (HCU) హెచ్‌సీయూపై మీ ఏఐ గ్రాఫిక్స్ వీడియోలు చూసి సినీ ఇండస్ట్రీ వారు ఈర్ష పడుతున్నారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్, బీజేపీ గుప్పిట్లో ఉందని ట్రోల్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. జీవులు, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్లుగా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) ఏవిధంగా అయితే డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) ట్రిక్స్ చేశాడో.. అలా గ్రాఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలు (BRS) బీఆర్ఎస్, బీజేపీ (BJP) పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి సోషల్ మీడియా టీమ్ సమర్దవంతంగా పనిచేస్తుందన్నారు. కానీ సమాజం, ప్రకృతి ప్రేమికులు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే? హెచ్‌సీయూ పరిస్థితులు, వీరు క్రియేట్ చేస్తున్న పరిస్థితలు గమనించాలని సూచనలు చేశారు. (CM Revanth Reddy) సీఎం రేవంత్ చట్టబద్ధంగా పనిచేస్తారని, సుప్రీంకోర్టు, హైకోర్టులకు లోబడే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎక్కడైనా అడవిలో ఏనుగులు, జింకలు, నెమళ్లు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటాయని అన్నారు. వీరి గ్రాఫిక్స్ మాయలో పడి అన్ని మరిచిపోయారని తెలిపారు.
శ్రీరామనవమి రోజు కూడా బీజేపీ రాజకీయాలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గురించి తెలియక బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై ఇక్కడ జరుగుతున్న విషయంపై ఏఐసీసీకి, సమాజానికి తెలియజేయాల్సిన వ్యక్తి అని చెప్పారు. బండి సంజయ్ అజ్ఞాన పూరిత స్టేట్‌మెంట్స్ వల్ల మిమ్మల్ని అసహాయ మంత్రి అంటున్నారని విమర్శలు చేశారు.






