- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీఎం రమేష్ కు సవాల్ విసరాలి: అద్దంకి దయాకర్
by Ajay Maddhiboyina |
కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం రమేష్‌కు సవాల్ విసరాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లలేదు

X
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం రమేష్‌కు సవాల్ విసరాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లలేదు, బీజేపీలో విలీన ప్రతిపాదన తీసుకురాలేదని కేటీఆర్ నిరూపించుకోవాలని సవాల్ చేశారు. బీజేపీతో అంతర్గత ఒప్పందం వల్లనే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని అన్నారు. చివరకు చెల్లెను విడిపించడానికి బీజేపీతో ఒప్పందం చేసుకుంటే, విలీనం అవసరం లేదు ఎన్నిరోజులు అయినా జైలులో ఉంటానని సొంత చెల్లెలే ఒప్పుకుందన్నారు. అలా ఒప్పుకున్నందుకు ఆమెను సైతం టార్గెట్ చేసిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సీఎం రేమేష్ వ్యాఖ్యలు నిజం కాదని నిరూపించుకోవాలని కేటీఆర్‌ను సవాల్ చేస్తున్నారు.
Next Story






