- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడీసీపీ షో ఆఫ్ ఫోర్స్.. పోలీస్ వ్యవస్థలో పరేషాన్, రాజకీయాల్లో దుమారం..!
డీజీపీ స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంప్యానెల్మెంట్ ప్రకారం ఉన్నతాధికారులు ఓ కాంట్రాక్టర్ ను నియమించారు.

దిశ, సిటీక్రైం : డీజీపీ స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంప్యానెల్మెంట్ ప్రకారం ఉన్నతాధికారులు ఓ కాంట్రాక్టర్ ను నియమించారు. ఎంప్యానెల్మెంట్ ప్రకారం రూపొందించిన రూల్స్ ప్రకారం సదరు కాంట్రాక్టర్ కొన్ని ఏండ్ల కిందట ప్రజా భద్రతకు అనుగుణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీలకమైన, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జోన్ కు ఇటీవల అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ వచ్చారు. ఇప్పుడు అతని వ్యవహారం సైబరాబాద్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇలా వచ్చిన ఆ డీసీపీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ ను తనను కలవాలని హూకుం జారీ చేశారు. కనఫ్యూజ్ అయిన కాంట్రాక్టర్ వెళ్ళి కలవడంతో సీసీ కెమెరాలు సరిగా పని చేయడంలేదంటూ డొంక తిరిగినట్లు మాట్లాడాడు. కాంట్రాక్టర్ మాత్రం తాను ఎంప్యానెల్మెంట్ ప్రకారమే ఇన్ స్టాల్ చేశానని చెప్పాడు. అయినా తనను కలవాలని ఇన్ డైరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చాడు. కాంట్రాక్టర్ మాత్రం రూల్స్ ప్రకారం చేశానని పట్టించుకోలేదు.
దీంతో ఆ ఏడీసీపీ ఓ అనధికార నోటీసును ఇచ్చారు. దీనికి రూల్ ప్రకారం నోటీసు ఇవ్వాలని , ఈ నోటీసు చెల్లదని ఏడీసీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఏడీసీపీ ఇచ్చిన నోటీసుకు రశీదు ఇవ్వాలని కాంట్రాక్టర్ అడిగారు. కంగుతిన్న ఏడీసీపీ రశీదు లేదంటూ తెలిపాడు. ఈ విషయాన్ని వదిలేయాలంటూ కాంట్రాక్టర్ కు చెప్పడంతో విషయం సద్గుమనిగింది. మళ్ళీ రిపీట్ కావడంతో.. ఏడీసీపీ విషయాన్ని రాజకీయ వర్గంలో "ఏడు కొండలంత" దైవంగా భావించే శక్తి దగ్గరకు పోలీస్ కాంట్రాక్టర్ ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో.. అలాంటిది ఏం లేదని జస్ట్ కెమెరాలు పని చేయడం లేదని చెప్పి కామ్ అయ్యాడని తెలిసింది. దీంతో పోలీస్ కాంట్రాక్టర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఈ ఏడీసీపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఏడీసీపీ డ్యూటీ కి తక్కువ డీసీపీ డ్యూటీకి ఎక్కువ
ఏడీసీపీ (అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు) పోస్టులో ఉండే అధికారులు ఆ జోన్ కు సంబంధించిన అడ్మిన్ వ్యవహారాలు చూడాలి. ఈ ఏడీసీపీలకు ఫైల్స్ కు సంబంధించిన పరిశీలన అధికారం లేదు. సంతకం చేసే పవర్ కూడా ఉండదని పోలీసు వర్గాలు అంటున్నాయి. జోన్ లో అడ్మిన్ వ్యవహారాలతో పాటు బందోబస్తు వంటి కార్యక్రమాలను పరిశీలించుకుని సిబ్బందితో సమన్వయం చేసకుంటు పని చేసే విధులు ఉంటాయని పోలీసు వర్గాల చెప్పుతున్నాయి. డీసీపీ, ఆ పై ఉన్నతాధికారులు కేటాయించే విధులను ఈ ఏడీసీపీ చేయాల్సి ఉంటుందన్నారు. కాని ఈ ఏడీసీపీ చాలా డిఫరెంట్ గా పని చేస్తుండడంతో ఈ జోన్ పోలీసులను కలవరానికి గురి చేస్తోంది.
ఐ యామ్ ఫ్రమ్ ఏసీబీ
ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్ లో ఇన్ స్పెక్టర్ లు ముందుగా లాగిన్ అయ్యి ఏసీపీలను కలుపుతారు. ఆ తర్వాత అడీసీపీను కలుపుతారు. చివరగా డీసీపీ లాగిన్ అయ్యి జోన్ లలో చోటు చేసుకుంటున్న నేరాలు, ఇతర కార్యక్రమాల పై చర్చించుకుంటారు. ఈ ప్రక్రీయ ప్రతి రోజు జరుగుతుంది. చివరగా డీసీపీ లాక్ఔట్ అవుతారు. ఓ రోజు ఇలా డీసీపీ లాగ్ ఔట్ అవగానే ఈ ఏడీసీపీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతు నేను ఏసీబీ నుంచి వచ్చాను మీ చిట్టా అంతా నాకు తెలుసు కాబట్టీ జాగ్రత్త అంటూ హెచ్చరికలు ఇచ్చారు.
ఈ డైలాగ్ లతో ఈ జోన్ పరిధిలోని రెండు ఏసీపీ డివిజన్ లోని 7 ఠాణాల ఇన్ స్పెక్టర్ లు కంగుతిన్నారు. అంతే కాకుండా ఏసీబీ లో తాను మాజీ మంత్రి పై పెట్టిన కేసులో తాను కీలకంగా వ్యవహరించానని అందుకే ప్రభుత్వం నన్ను గుర్తించి తనను ఈ జోన్ ఏడీసీపీగా నియమించిందని వ్యాఖ్యానాలు చేస్తుండడం పోలీసు వర్గాల్లోనే కలకలం రేపుతోంది. అయితే ఏసీబీ లో ఈ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా ఉండడంతో ఏసీబీ ఉన్నతాధికారి తనకు ఈ ఆఫీసర్ వద్దంటూ ప్రతిపాదన పెట్టడంతోనే అతను ఏసీబీ నుంచి బయటికి పంపించారనే సమాచారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో వైరల్ గా మారింది.
2 సంవత్సరాల కిందటి కేసుల పై నజర్
ఈ ఏడిసిపి తనకు కేటాయించిన విధులు కాకుండా...కీలకమైన ఈ జోన్ లో రెండు సంవత్సరాల కిందట నమోదైన ల్యాండ్ కేసులు, ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన కేసుల దృష్టి పెట్టి ఆ కేసులలో ఉన్న అనుమానితులు, బాధితులు తనను వచ్చి కలిసేలా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిసింది. వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఈ ఏడీసీపీ తో తాము ఏగలేమంటూ పోలీసు అధికారులు వారిలోనే గునుగుకుంటున్నారు. ఇలా పోలీసు వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు జోన్ పరిధిలో దాటి రాజకీ వర్గాల్లో కూడా దుమారం రేపుతోంది. అంతే కాకుండా నా ఆస్తి విలువ తెలుస్తే కంగుతింటారు.. ఐ యామ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటూ తనకు తాను కితాబు ఇచ్చుకోవడం కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో సెన్సేషన్ అయ్యింది.






