హైదరాబాద్ రానున్న ఏడీబీ ప్రతినిధులు

by Malleboina Mahesh |

గాంధీ సరోవర్, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ డీపీఆర్ పరిశీలనకు బుధవారం హైదరాబాద్ రానున్న ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధులు!

హైదరాబాద్ రానున్న ఏడీబీ ప్రతినిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణశాఖ చెందిన 83 ఎకరాల భూములను బదిలీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే డీపీఆర్‌ను ఎంఆర్డీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో డీపీఆర్ ను పరిశీలించడానికి ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) అధికారులు బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.4,100కోట్ల రుణం ఇవ్వడానికి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన ఏడీబీ అధికారులు.. మరోసారి డీపీఆర్ ను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపైనా ప్రభుత్వంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది.

Next Story