- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాడ్ ఏజెన్సీలు VS జీహెచ్ఎంసీ..! హోర్డింగ్స్ విషయంలో కోల్డ్ వార్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, యూనిఫోల్స్ విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, యూనిఫోల్స్ విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది. విలీన ప్రాంతాల్లో హోర్డింగ్స్, యూనిపోల్స్ అడ్వర్టైజ్‌మెంట్ ఏర్పాటు చేయకూడదని ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. కొత్త పాలసీ వచ్చేవరకు తమ జోలికి రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు జీహెచ్ఎంసీని కోరుతున్నారు. ఈ మేరకు శు క్రవారం అడ్వర్టైజ్‌మెంట్ డిప్యూటీ కమిషన ర్ పద్మకు తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఏజెన్సీల వారు వినతిపత్రం అందించారు.
స్పందించకుంటే.. తొలగిస్తాం: జీహెచ్ఎంసీ
అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలు, జీహెచ్ఎంసీ మధ్య వార్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ విస్తరించిన తరువాత విలీన ప్రాంతాల్లో హోర్డింగ్స్, యూనిపోల్స్ అడ్వర్టైజ్‌మెంట్ ఏర్పాటు చేయకూడదని 250 ఏజెన్సీలకు జీహెచ్ఎం సీ నోటీసులు జారీ చేసింది. వెంటనే స్పం దించకపోతే ఫ్రేమ్స్ తామే తొలగిస్తామని పేర్కొంది. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 2020లో హోర్డింగ్స్, యూనిపోల్స్‌ని జీహెచ్ఎంసీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తరించడంతో ఇదే చట్టం అక్కడా వర్తించనుంది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. అయితే లోకల్ బాడీల్లో 2023 వరకు అధికారికంగా ట్యాక్స్‌లు కలెక్ట్ చేసి అనుమతులు ఇచ్చినప్పటికి ఆ తరువాత అక్కడ కూడా బ్యాన్ చేశారు. అయినా కొనసాగిస్తుండటంపై అధికారులు 250 ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. వెంటనే ఫ్రేమ్‌లు తొలగించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఓ పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను హైడ్రా తొలగిస్తుంది. మరోపక్కన జీహెచ్ఎంసీ వీరికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వడంపై ఏజెన్సీలు మండిపడుతున్నాయి. కొత్త పాలసీ వచ్చేంత వరకు తమ హోర్డింగ్స్, యూనిపోల్స్ తొలగించవద్దని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.
తొలగించొద్దు.. ఏజెన్సీలు
జీహెచ్ఎంసీ నిర్ణయంతో తాము ఇబ్బం దులు పడుతున్నామని, ఇప్పటికే ఎంతో మంది నష్టపోయారని ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలు వారి ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారని, కేవలం చిన్న ఏజెన్సీలైన మేము రోడ్డున పడుతున్నామన్నారు. కొత్త పాలసీ వచ్చే వరకు తొలగించకూడదని, పాలసీ వచ్చిన తర్వాత టెండర్ల ద్వారా దక్కించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఏజెన్సీలతో మీటింగ్
హోర్డింగ్స్, యూనిఫోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ 250 మంది ఏజెన్సీల నిర్వాహకులకు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్ విభాగం డీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామాలపై ఏజెన్సీలతో అడిషనల్ కమిషనర్ (ఏడీవీటీ) అనురాగ్ జయంతితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ తీసుకునే నిర్ణయంపై స్పష్టతరానుందని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.






