- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ స్కూళ్లలో తీరని టీచర్ల కొరత.. రిమోట్ ఏరియాల్లో బోధన అస్తవ్యస్తం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న టీచర్ల కొరతపై విద్యాశాఖ తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా, బోధనా సిబ్బంది కొరతను తీర్చడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్కాలిక విధివిధానాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో మిగులు ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌పై పంపడమే తప్ప, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
పట్టణాలకే పరిమితం..
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో మరో ప్రధాన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బదిలీలు, డిప్యుటేషన్ల సమయంలో మెజారిటీ ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత క్లిష్టంగా మారుతోంది. రిమోట్ ఏరియాల్లోని పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో ఐదు తరగతులను నడపాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హై స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న సబ్జెక్టుకు ఒక టీచర్ చొప్పున 30 మంది విద్యార్థులున్న చోట 5 నుండి 8 మంది ఉపాధ్యాయులు ఉంటున్నారు. అదే ప్రాథమిక పాఠశాలల విషయానికొస్తే 50 నుండి 60 మంది విద్యార్థులున్న చోట ఇద్దరే టీచర్లు ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాల్సిన విద్యాశాఖ అధికారులు ఎంతసేపూ బోధనేతర పనులపైనే దృష్టి పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
డిప్యుటేషన్లతోనే సరి..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను గుర్తించి, వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద అవసరమైన చోట్లకు పంపే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ డిప్యుటేషన్ల పర్వం కేవలం ఒక విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితం కావడం, ఆ తర్వాత మళ్లీ పాత పరిస్థితే పునరావృతం కావడం సర్వసాధారణంగా మారింది. ఈ తాత్కాలిక తూ తూ మంత్రపు చర్యల వల్ల అటు ఉపాధ్యాయులకు స్థిరత్వం లేకపోగా, ఇటు విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు.
శాశ్వత పరిష్కారం?
ప్రభుత్వాలు మారుతున్నా, విద్యా సంవత్సరాలు గడుస్తున్నా టీచర్ల కొరతను అధిగమించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలావరకు టీచర్ల సర్దుబాటు విషయంలో పైరవీలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చాలావరకు టీచర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడని నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు మిగులు ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికన పంపడం ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రేషనైజేషన్ వద్దు..
రాష్ట్రంలో జీవో 25 ఆధారంగా రేషనైజేషన్ ప్రక్రియ చేపట్టకూడదు. 1:19 కు ఇద్దరూ ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలో ఉండాలి. ఉన్నత పాఠశాలకు సబ్జెక్టు ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలకు కూడా సబ్జెక్టు ఆధారితంగానే రేసన్లైజేషన్ ప్రక్రియను చేపట్టాలి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఒకే హాబిటేషన్ లో ఉన్నటువంటి పాఠశాలలను కలిపి వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీవో 25 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రాథమిక పాఠశాలకు ఉపయోగంగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలి.
- తెల్కలపల్లి పెంటయ్య, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి






