- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరలో తన కుక్కకు తులాభారం.. సారీ చెప్పిన హీరోయిన్
కమిటీ కుర్రాళ్లు, ప్రీవెడ్డింగ్ షో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటి టీనా శ్రావ్య. అయితే ఈ హీరోయిన్ మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం తూకం) వేసి విమర్శలు ఎదుర్కొంటోంది.

దిశ, వెబ్ డెస్క్: కమిటీ కుర్రాళ్లు, ప్రీవెడ్డింగ్ షో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటి టీనా శ్రావ్య. అయితే ఈ హీరోయిన్ మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం తూకం) వేసి విమర్శలు ఎదుర్కొంటోంది. కుటుంబంతో మేడారం వెళ్లిన శ్రావ్య అక్కడ తన పమేరియన్ జాతికి చెందిన కుక్కకు తులాభారం వేసింది. సాధారణంగా భక్తులు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరిగితే ఎవరికోసం కోరుకుంటారో వారి బరువు గల బెల్లం తూకం వేసి దేవుడికి సమర్పించడం ఆచారం. అయితే సాధారణంగా మనుషులకే తులాభారం వేస్తుంటారు.
కానీ టీనా శ్రావ్య తన పెంపుడు జంతువుకు తులాభారం వేయగా వీడియో వైరల్ అవ్వడంతో విమర్శల పాలైంది. ఇక తాజాగా టీనా శ్రావ్య ఈ వివాదంపై స్పందించింది. తన కుక్క అనారోగ్యం నుండి కోలుకుంటే బంగారం తూకం వేస్తానని మొక్కుకున్నట్టు తెలిపింది. తన కోరిక నెరవేరవడంతో అలా చేశానని చెప్పింది. భక్తితోనే ఆ పని చేశానని గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని కోరింది. ఈ మేరకు టీనా ఓ వీడియోను విడుదల చేసింది.






