Sohani Kumari: జూబ్లీహిల్స్‌లో నటి సోహానీ కుమారి కాబోయే భర్త ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-29 05:16:50  IST  )

టాలీవుడ్ నటి సోహానీ కుమారికి కాబోయే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Sohani Kumari:  జూబ్లీహిల్స్‌లో నటి సోహానీ కుమారి కాబోయే భర్త ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి సోహానీ కుమారికి కాబోయే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సవాయ్ సింగ్.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. తాను చేసిన తప్పులతో ఇబ్బందులు పడుతున్నానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. రాజస్థాన్ కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది జులైలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

శనివారం (సెప్టెంబర్ 27) సవాయ్ సింగ్ ఆఫీసుకు వెళ్లగా.. సోహాని సాయంత్రానికి ఇంటికి వచ్చింది. తలుపు తెరచి చూసేసరికి డైనింగ్ హాల్ లో సవాయ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నట్లు గుర్తించారు. తనకంటే ముందే సవాయ్ కు మరో యువతితో పరిచయం, ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సవాయ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ను కూడా విచారిస్తున్నారు.

Next Story