అసలేం జరిగిందంటే?.. కారు ప్రమాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-07 10:11:16  IST  )

కారు ప్రమాదం విజయ్ దేవరకొండ స్పందించారు.

అసలేం జరిగిందంటే?.. కారు ప్రమాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: కారు ప్రమాదం(Car Accident)పై నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కారు దెబ్బతిన్నదని.. తాము అందరం క్షేమంగా ఉన్నాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్ పేర్కొన్నారు. కాగా, జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవల్లి సమీపంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి విజయ్‌ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి.. స్నేహితుడి కారులో విజయ్‌ అక్కడి నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. విజయ్‌ తన స్నేహితులతో కలసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయ్‌ కారు డ్రైవర్‌ అందె శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఉండవల్లి ఎస్.ఐ ఆర్.శేఖర్ తెలిపారు.




Next Story