Viral: ప్రెస్‌మీట్ అనంతరం నటుడు శివాజీ.. పరుగో పరుగు.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-12-25 14:50:14  IST  )

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ(Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

Viral: ప్రెస్‌మీట్ అనంతరం నటుడు శివాజీ.. పరుగో పరుగు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ(Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ శివాజీ ‘దండోర’(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. తెలంగాణ మహిళా కమిషన్‌తో పాటు, యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి మరోవైపు నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు. ఈ వివాదం మరింత ముదరడంతో ఆయన బుధవారం ప్రెస్ మీట్‌‌ నిర్వహించి క్షమాపణలు చెప్పారు. ఆ వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు వాడినందుకు పశ్చాత్తాపం చెందుతున్నానని, ఆ మాటలు పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ రెండు ప‌‌దాలు అన్‌‌పార్లమెంటరీ వర్డ్స్‌‌ కాబట్టి అంద‌‌రికీ సిన్సియ‌‌ర్‌‌గా క్షమాప‌‌ణ‌‌లు చెబుతున్నానని, కానీ తాను ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌కు మాత్రం క‌‌ట్టుబ‌‌డే ఉన్నానని స్పష్టం చేశారు.

అయితే, ఈ ప్రెస్‌మీట్ అనంతరం శివాజీ పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనతో ఎవరు మాట్లాడకుండా ఉండేందుకు ఆయన ప్రెస్‌మీట్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి రన్నింగ్ చూసుకుంటూ వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సామాన్లు’ కొనడానికి పరుగులు తీస్తున్నావా..? అంటూ పలువురు నెటిజన్‌లు ట్రోల్స్ చేశారు. వివాదం నేపథ్యంలో అక్కడికి వచ్చిన నిరసనకారుల భారీ నుంచి తప్పించుకోడానికి ఆయన పరుగులు తీసినట్లు పలువురు నెటిజన్‌లు భావిస్తున్నారు. వీడియో ఇదే..

Next Story