Brahmanandam: ప్రేమను పంచుకోవడం ఇప్పుడు చాలా అవసరం

by Gantepaka Srikanth |

హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ - బలయ్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు.

Brahmanandam: ప్రేమను పంచుకోవడం ఇప్పుడు చాలా అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ - బలయ్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలయ్ - బలయ్ అంటే ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమను పంచుకోవడమని, ప్రేమ, శాంతిని కొల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యక్రమాల నిర్వహణ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అంతకుముందు అలయ్ - బలయ్​కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు సందేశం పంపించారు. తెలంగాణ రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిందని, బతుకమ్మ నృత్యాలు వంటి శక్తివంతమైన ప్రదర్శనలు, కళలు ప్రజలను ఒక చోటకు చేర్చే ఉత్సవమన్నారు. ప్రజల్లో ఐక్యత, సమాజ విలువలను వ్యాప్తికి ఈ వేడుక సామాజిక సందేశంగా ఉటుందని, అలయ్​బలయ్​సంబరాలు ఘనంగా జరగాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా మరునాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో నిర్వహించారు.

Next Story