- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెక్కి వెక్కి ఏడ్చిన నటుడు బాలకృష్ణ
by Muthe.Rajitha |
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళవారం బాలకృష్ణ సోదరుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యి, కంటతడి పెట్టుకున్నారు. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మలాంటిదని ఎమోషనల్ అయ్యారు. తాను స్కూలుకు వెళ్లే సమయంలో తన బాగోగులు అమ్మలాగే దగ్గరుండి చూసేదని గుర్తు చేసుకొని ఏడ్చారు. తనకు అమ్మలేని లోటు ఎప్పుడూ తెలియనివ్వలేదని బాలకృష్ణ పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చారు. కాగా ఎప్పుడు సరదాగా ఉండే బాలయ్య బాబు కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






