- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతున్న పోలీసు అధికారి.. ? పట్టుకున్న స్థానికులు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి తరపున పోలీసు అధికారి డబ్బులు పంచుతూ స్థానికులకు పట్టుబడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి తరపున పోలీసు అధికారి డబ్బులు పంచుతూ స్థానికులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోటల్ SVM నుంచి కారులో పోలీస్ ఆఫీసర్ డబ్బులు తీసుకెళ్తున్నట్లు గమనించిన స్థానికులు.. ఆ కారును వెంబడించి అడ్డుకున్నారు. డబ్బులు పంచుతున్నావని ఆఫీసర్‌తో వారించిన స్థానికులు కారులో సోదాలు చేయగా ఆరు లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. దీంతో ఆ పోలీసు అధికారిని డబ్బు తో సహా పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది. కాగా వీడియోలోని స్థానికులు ఆ డబ్బు మల్లారెడ్డికి చెందినదిగా వారించారు. అయితే ఈ డబ్బు ఎవరి తరపున పంచుతున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






