- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో శనివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.
విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో శనివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో శనివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును ఇనుప పైపుల లోడుతో వచ్చిన ట్రాలీ ఆటో (టాటా ఏస్) వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలోని ఇనుప రాడ్లు కారు వెనుక అద్దాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లాయి. ఆ సమయంలో కారు వెనుక సీట్లో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ ప్రధాన కూడలి వద్ద సిగ్నల్ పడడంతో ఒక ప్రైవేటు కారు ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో, ప్రమాదకర రీతిలో ఇనుప పైపుల లోడుతో వస్తున్న ఒక ట్రాలీ ఆటో.. అదుపుతప్పి కారును ఢీకొట్టింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక ఉన్న ఇనుప రాడ్లు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాయి. దీంతో రాడ్ల ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమై, అవి నేరుగా కారు క్యాబిన్ లోకి చొచ్చుకు పోయాయి.
లోడింగ్ నిబంధనల ఉల్లంఘనే కారణమా?
సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారు వెనుక సీటు ఖాళీగా ఉంది. కేవలం డ్రైవర్ సీటులో మాత్రమే వ్యక్తి ఉండటంతో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఒక్క అంగుళం అటు ఇటు అయినా పరిస్థితి దారుణంగా ఉండేదని.. వామ్మో.. జస్ట్ మిస్ అంటూ ప్రత్యక్ష సాక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇనుప రాడ్లు, ప్రమాదకరమైన వస్తువులను నిబంధనలకు విరుద్ధంగా ట్రాలీ ఆటోల్లో తరలిస్తుండటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు.






