- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
by Sathputhe Rajesh |
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గంలో పలు వివాహ కార్యక్రమాలకు వెళ్ళే సమయంలో పెర్కిట్ ఎంఅర్ గార్డెన్ వద్ద కాన్వాయ్ లో ముందు వున్న కార్లు బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కారును కౌన్సిలర్ల కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కౌన్సిలర్ రంగన్న, గంగమోహన్ ఛక్రుకు గాయాలయ్యాయి. కౌన్సిలర్ రంగన్నను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైస్ చైర్మన్ మున్న బాయ్ కాలు విరగడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






