శీతల తండాలో ఏసీబీ కలకలం

by velandi.Saikiran |

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండాలో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శీతల తండాలో ఏసీబీ కలకలం
X

*శీతల తండాలో కలకలం*

*అర్ధరాత్రి ఏసీబీ తనిఖీలు*

*అడ్డంగా బుక్కైన అధికారి*


దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండాలో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇస్లావత్ వినోద్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లాలోని కర్తాల్ ల్లో గతంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతడు బదిలీపై సూర్యాపేట వచ్చాడు.

ఈ క్రమంలో అతడి పై అవినీతి ఆరోపణలు రావడం తో మంగళవారం ఏ సీ బీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు శీతలతండ రావడం తో అతడిని వెంబడించిన అధికారులు శీతల తండాలో పట్టుకున్నారు. తరువాత విచారణ కోసం సూర్యాపేట తరలించారు.

Next Story