ఆదాయానికి మించిన ఆస్తులు.. అగ్రికల్చర్ ఏడీ కిరణ్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

by Ramesh Naini |

ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినందుకు అక్రమ ఆస్తుల కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సుందరి కిరణ్ కుమార్‌పై కేసు నమోదైంది.

ఆదాయానికి మించిన ఆస్తులు..  అగ్రికల్చర్ ఏడీ కిరణ్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినందుకు అక్రమ ఆస్తుల కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సుందరి కిరణ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన నివాసాలపై శనివారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఏడీ కిరణ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు.. హైదరాబాద్, తుక్కుగూడ, సహా మొత్తం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తులకు చెందిన నివాసాలలో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

అవినీతి చర్యలు, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై చర్యలు చేపట్టినట్లు పేర్కోన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద శిక్షార్హమైన కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు. ఏసీబీ గుర్తించిన వివరాల ఆధారంగా ఆస్తుల విలువ సుమారు రూ. 4 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ విలువ దాదాపు పది రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పేర్కొన్నారు.

సోదాల్లో గుర్తించిన ఆస్తులు..

వ్యవసాయ భూములు – మొత్తం విస్తీర్ణం 97.03 ఎకరాలు

ఓపెన్ ప్లాట్లు – 3

వాహనాలు – 5

బీమా పాలసీలు – రూ. 5,50,000 విలువ

అధికారి, కుటుంబ సభ్యుల పెట్టుబడులు – రూ. 50లక్షలు

ఫ్లాట్లు – 2

ఇల్లు – 1

Next Story